వేదిక: తెలుగు 3వ ప్రపంచ మహాసభలు
స్థలం: గుంటూరు
తేదీ: 03 జనవరి 2026
తెలుగు భాష, సాహిత్యం మరియు సాంస్కృతిక విలువల పరిరక్షణకు శతాబ్దకాలానికి పైగా విశిష్ట సేవలందిస్తున్న ఆంధ్ర సరస్వత పరిషత్ నుండి German Telugu Association (GeTA) e.V కు ప్రతిష్ఠాత్మకమైన పూర్ణ కుంభ పురస్కారం 03 జనవరి 2026 న లభించినట్లు గర్వంగా తెలియజేస్తున్నాము.
ఈ పురస్కారం గుంటూరు లో నిర్వహించబడిన తెలుగు 3వ ప్రపంచ మహాసభల సందర్భంగా ప్రదానం చేయబడింది. German Telugu Association (GeTA) e.V తరఫున ఈ గౌరవాన్ని German Telugu Association (GeTA) e.V అధ్యక్షులు శ్రీ కొండల్ రెడ్డి అంకమ్మగారి గారు స్వీకరించారు.
పూర్ణ కుంభ పురస్కారం సమాజానికి నిరంతర సేవ, నైతిక విలువలు మరియు విశ్వసనీయతకు ప్రతీకగా భావించబడుతుంది. ఈ పురస్కారానికి ఎంపిక చేసే ప్రక్రియలో ప్రధానంగా సంస్థలోని స్వచ్ఛత, పారదర్శకత, అలాగే ఎంతమంది సంస్థను సిఫారసు చేశారు మరియు ఆ సిఫారసులకు గల సామాజిక ప్రాముఖ్యత గల కారణాలే ముఖ్య ప్రమాణాలుగా తీసుకున్నట్లు తెలిపారు.
ఈ గౌరవం German Telugu Association (GeTA) e.V సభ్యులందరికీ చెందింది. భవిష్యత్తులో మరింత బాధ్యతతో, నిబద్ధతతో సమాజ సేవ కొనసాగించాలనే మా సంకల్పాన్ని ఈ పురస్కారం మరింత బలపరుస్తోంది.
German Telugu Association (GeTA) e.V సమాజాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ మరియు సామాజిక బాధ్యతల రంగాల్లో నైతిక విలువలతో, సమగ్ర దృక్పథంతో నిరంతరం సేవలందిస్తోంది.
ఈ సందర్భంగా GeTA Association Foundation అధ్యక్షులు శ్రీ కొండల్ రెడ్డి అంకమ్మగారి గారు, ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం సంస్థ సభ్యులందరి సమిష్టి కృషి ఫలితమని పేర్కొంటూ, GeTA Association Foundation సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.